'V' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది!

Update: 2020-03-09 15:35 GMT
V movie

యంగ్ హీరోస్ నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం 'వి'... ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. నిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ నుంచి 'చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక..' అంటూ సాగే సాంగ్ వీడియో ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఫుల్ సాంగ్ ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, శ్రేయ ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

ఇక ఈ చిత్రంలో నాని ఓ సైకో పాత్ర పోషిస్తుండగా, సుధీర్‌ బాబు పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించనున్నాడు. అదితిరావు హైదరి, నివేతా థామస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 


Full View


Tags:    

Similar News