నటి వరలక్షీ శరత్‌కుమార్‌కు కరోనా పాజిటీవ్.. ఇకనైనా ఆ విషయంలో పట్టుబట్టాలని పోస్ట్..!
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.
నటి వరలక్షీ శరత్‌కుమార్‌కు కరోనా పాజిటీవ్.. ఇకనైనా ఆ విషయంలో పట్టుబట్టాలని పోస్ట్..!
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె స్వల్వ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ''అన్నిరకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే, సెట్‌లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా పట్టుబట్టాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్‌లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్నవాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించేలా చూసుకోవాలి'' అని వరలక్ష్మి పేర్కొన్నారు. కాగా వరలక్ష్మికి కరోనా సోకిందన్న విషయం తెలవగానే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.