Pawan Kalyan: వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ !
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నట్లు దిల్ రాజు ప్రకటించారు.
Pawan Kalyan:(File Image)
Pawan Kalyan: మున్నా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయిన వంశీ పైడిపల్లి కి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ విషయంపై దిల్ రాజు – వంశీ పైడిపల్లి ఇద్దరూ పవన్ ని కలిసారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెరపై తిరిగి సందడి చేశారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచిన పవన్ సూపర్ హిట్ ను అందుకున్నారు. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. దిల్ రాజు బోనికపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు, వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా నిర్మించిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్న్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు.
అయితే తాజాగా పవన్ దిల్ రాజు సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఇతడే అంటూ ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా బాధ్యతలను దిల్ రాజు వంశీ పైడిపల్లి చేతిలో పెట్టనున్నారని అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో 'మున్నా' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి.. ఆ తర్వాత 'బృందావనం' 'ఎవడు' 'మహర్షి' వంటి సినిమాలను దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కించాడు. ఇక మహర్షి సినిమా నేషనల్ అవార్డు మును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.