Vakeel Saab Movie Team: పవన్ ఫ్యాన్స్ కి వకీల్ సాబ్ చిత్రబృందం ఆర్ధిక సాయం..

Vakeel Saab Movie Team: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

Update: 2020-09-02 05:46 GMT

Vakeel Saab Movie Team: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో కొందరు ఫ్యాన్స్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.

విషయం తెలుసుకున్నపవన్ అభిమానుల మృతి ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశారు. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక వారి తల్లితండ్రులకు తానే ఒక బిడ్డగా నిలుస్తానని, వారి కుటుంబాలను ఆదుకుంటానని తెలిపారు. విద్యుత్‌ఘాతంతో మృతి చెందిన అభిమానుల‌కు ఒక్కొక్క‌రికీ రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక‌సాయం అందించాల‌ని పార్టీ కార్యాల‌య సిబ్బందిని ఆదేశించిన‌ట్లు ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

అయితే, చిత్తూర్ జిల్లలో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు వకీల్ సాబ్ చిత్రబృందం శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ వారు 2 ఆర్ధిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సాయం, అలగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. అభిమానులంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం అంటూ చిత్రబృందం తెలిపింది.



Tags:    

Similar News