Upasana Konidela: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉపాసన..
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సంచలన విషయాన్ని వెల్లడించారు.
Upasana Konidela: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉపాసన..
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సంచలన విషయాన్ని వెల్లడించారు. గత వారం తాను కరోనా బారిన పడ్డానని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేస్తూ.. చెన్నైలోని తన గ్రాండ్ పెరెంట్స్‌ను కలిసేందుకు కోవిడ్ టెస్ట్ చేసుకున్నానని, ఈ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో వారం రోజులుగా వైద్యుల సూచనతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె చెప్పారు.
వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దాంతో వైద్యులు కేవలం పారాసిటిమాల్, విటమిన్ మందులు మాత్రమే వాడమని చెప్పారు. కొవిడ్ నుంచి కోలుకున్నాక. శారీరకంగా, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉన్నా. కొవిడ్ మళ్లీ విరుచుకుపడుతుందా? అంటే చెప్పలేం. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండటం, సంతోషంగా జీవించడం ఎంతో ముఖ్యం. చెన్నైలో ఉన్న మా తాతయ్యని కలిసేందుకు వెళ్లాలనుకుని పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. ఒకవేళ టెస్టులు చేయించుకోకపోతే ఎవరికీ తెలిసేది కాదు'' కోలుకోవడానికి సహయం చేసిన వైద్యులకు కృతజ్ఞతలు " అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన.