Unidentified Persons Huddled At The Mohan Babu Home : సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద కలకలం

Unidentified Persons Huddled At The Mohan Babu Home : టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు

Update: 2020-08-01 16:27 GMT
Mohan babu (File Photo)

Unidentified Persons Huddled At The Mohan Babu Home : టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హల్ చల్ చేశారు. నేరుగా మోహన్‌బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్ళడం కలకలం రేపింది. మిమ్మల్ని వదలమంటూ కొందరు దుండగులు హెచ్చరించడంతో భయానికి లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఆ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేనట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులపై పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక దీనిపైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News