Tuck Jagadish Teaser: వెరైటీగా 'టక్ జగదీష్' టీజర్
Tuck Jagadish : నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా ఎంతలా అలరించిందో తెలిసిందే.
టక్ జగదీష్ పోస్టర్
Tuck Jagadish Teaser: నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన 'నిన్ను కోరి' సినిమా టాలీవుడ్ లో ఎంతలా అలరించిందో తెలిసిందే. కాగా.. మళ్లీ ఈ జోడీ ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్నదమ్ముల కథతో నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'టక్ జగదీష్'. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు.
అయితే, టీజర్ అంటే డైలాగ్స్, పాటలు, కామెడీ ఇలా అన్నీ ఉండేలా చూసుకుంటారు. కానీ, ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం సాంగ్ తోనే 'Tuck Jagadish' టీజర్ ను వెరైటీగా రిలీజ్ చేశారు. ఆపాటలోనే కథ చెప్పాడు డైరెక్టర్ శివ. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెంచేలా కనిపిస్తుంది. నాని కూడా చాలా రోజుల తర్వాత పక్కా కమర్షియల్ మాస్ సినిమా చేస్తున్నాడు.