Mahesh Babu Shooting Started : షూటింగ్ మొదలు పెట్టేసిన మహేష్!
Mahesh Babu Shooting Started : లాక్ డౌన్ వలన సినిమాల షూటింగ్ లు ఎక్కడికక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే.. దీనితో స్టార్స్ తమ ఇళ్లకే పరిమితం
Mahesh Babu Shooting Started
Mahesh Babu Shooting Started : లాక్ డౌన్ వలన సినిమాల షూటింగ్ లు ఎక్కడికక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే.. దీనితో స్టార్స్ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు.. తాజాగా కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యాయి.. ఇప్పటికే నాగార్జున, చైతన్య తమతమ సినిమా షూటింగ్ లను మొదలు పెట్టేశారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా షూటింగ్ లో పాల్గొన్నారు.. ఆయన సెట్స్ కు వెళ్లిన ఫోటోను ''మహేష్ బాబు టీం'' సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇందులో మహేష్ మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ ని పాటిస్తున్నట్టుగా ఉంది. అయితే ఇది సినిమ షూటింగ్ కాదు.. యాడ్ షూటింగ్.. అలాగే మహేష్ తన కొత్త సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నాడని తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వచ్చేసరికి ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి భారీ సక్సెస్ ను అందుకుంది.. ఇక ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారీ వారి పాట' అనే సినిమాలలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి..