టాలీవుడ్ హీరోయిన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్

సీనియర్ నటి, భరతనాట్యం కళాకారిణి శోభన ఫేస్ బుక్ ఖాత చోరికి గురైంది.

Update: 2020-04-22 07:13 GMT
Shobana (File Photo)

సీనియర్ నటి, భరతనాట్యం కళాకారిణి శోభన ఫేస్ బుక్ ఖాత చోరికి గురైంది. ఈ విషయాన్ని శోభన తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. అయితే లాక్ డౌన్ వేళ ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నాట్యం ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోడం పై పలు విషయాలు తెలియజేస్తూ చేస్తున్నానని శోభన చెప్పారు.

ఈ సందర్భంగా శోభన తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది . 'డియర్ ఫ్రెండ్స్.. నా ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు, దాన్ని పోలీసుల సమాచారం ఇచ్చాను. వారి సాయంతో తిరిగి క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్న. ఫేస్ బుక్ అకౌంట్ ని తిరిగి పొందిన తరువాత మరింత యాక్టివ్‌గా ఉంటాను ధన్యవాదాలు' అంటూ ఇస్టాలో సమాచారం ఇచ్చారు శోభన. శోభన నాట్య కళాకారిణిగా తన అద్భుతమైన ప్రతిభతో పలు ప్రదర్శనలు ఇచ్చారు.

నాగార్జున నటించిన విక్రమ్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకుల సరసన నటిస్తున్నారు. అభినందన వంటి మ్యూజికల్ హిట్ చిత్రాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ , మలయాళ, చిత్రాల్లో నటించింది. మలయాళ చంద్రముఖి(మణిచిత్రతాళు)చిత్రంలో శోభన నటనకు పలు అవార్డుల్ని పొందింది.



Tags:    

Similar News