మెగాస్టార్ ఆఫర్‌కు ఆ డైరెక్టర్ నో చెప్పాడా?

టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయనతో సినిమా చేసే అవకాశం కోసం ఎందరో డైరెక్టర్లు ఎదురుచూస్తుంటారు.

Update: 2020-04-08 06:04 GMT
Megastar Chiranjeevi (File Photo)

టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయనతో సినిమా చేసే అవకాశం కోసం ఎందరో డైరెక్టర్లు ఎదురుచూస్తుంటారు. అలాంటిది చిరు పిలిచి మరీ ఇచ్చిన అవకాశాన్ని ఓ దర్శకుడు సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. చిరంజీవి ప్రోత్సాహంతోనే చిత్రపరిశ్రలోకి వచ్చానని చెప్తూ వచ్చిన సదరు దర్శకుడు , ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆఫర్‌కు నో చెప్పడం ఫిలింనగర్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరనేది తెలుసుకోవాలని వుందా...ఆయన ఎవరో కాదు మారుతి.

మెగాస్టార్‌ తన ఫ్యామిలీలోని యువ హీరోల కెరీర్‌ను చూసుకుంటూ వస్తోన్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో రామ్ చరణ్‌, సాయి ధరమ్ తేజ్‌లకు చిరు ఇచ్చిన ఇన్‌పుట్‌లు వారికి మంచి విజయాలను ఇచ్చాయి. ఇక చిరు ఇప్పుడు తన చిన్నల్లుడు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ కెరీర్‌పై దృష్టి పెట్టిన చిరంజీవి అతడికి ఎలాగైనా ఓ హిట్ పడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కల్యాణ్‌ దేవితో ఓ సినిమా చేయాల్సిందిగా మారుతీకి ఆఫర్ ఇచ్చారట. కానీ కారణాలు తెలియదు గాని ఈ ఆఫర్‌ను మారుతీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో మారుతీపై చిరు కాస్త అసహంగా ఉన్నట్లు సమాచారం. మారుతి మళ్లీ తన మనసు మార్చుకుంటారా లేదో చూడాలి.. గతేడాది మారుతి మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో తెరకెక్కించిన ప్రతి రోజు పండగే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Tags:    

Similar News