Tollywood Bandh: షూటింగ్స్ ఆగిపోవడంతో స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్‌ కారణంగా చిత్ర పరిశ్రమ మొత్తం కుదేలైంది. స్టార్ హీరోల సినిమాల నుండి కొత్త హీరోల సినిమాల వరకు షూటింగ్స్ ఆగిపోవడంతో, ఇప్పటికే ప్లాన్ చేసిన రిలీజ్ డేట్స్ కూడా వాయిదా పడుతున్నాయి.

Update: 2025-08-17 04:58 GMT

Tollywood Bandh: షూటింగ్స్ ఆగిపోవడంతో స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్‌ కారణంగా చిత్ర పరిశ్రమ మొత్తం కుదేలైంది. స్టార్ హీరోల సినిమాల నుండి కొత్త హీరోల సినిమాల వరకు షూటింగ్స్ ఆగిపోవడంతో, ఇప్పటికే ప్లాన్ చేసిన రిలీజ్ డేట్స్ కూడా వాయిదా పడుతున్నాయి. బంద్ మొదలైన రోజున రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని నిర్మాతలు ఆశించారు. కానీ ఇప్పటివరకు 14 రోజులుగా సమ్మె కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో వాయిదా పడుతున్న మొదటి సినిమా మాస్ మహారాజ్‌ రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. సినిమా చివరి దశలో ఉంది. ఇంకా మాంటేజ్ సాంగ్‌, కొంత ప్యాచ్‌వర్క్ షూట్ మిగిలి ఉంది. ఈ నెల 27న విడుదల చేయాలని ముందే ప్రకటించిన మేకర్స్‌, సమ్మె కారణంగా ఆ డేట్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

నిర్మాతలు దీపావళి సీజన్‌లో సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ షూటింగ్స్ తిరిగి ఎప్పుడు మొదలవుతాయో తెలియకపోవడంతో, కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాలేదు.

Tags:    

Similar News