కరోనా నుంచి కోలుకున్న తమన్నా!
Tamannaah Bhatia Recovered : కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలకు వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి..
Tamannaah Bhatia
Tamannaah Bhatia Recovered : కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలకు వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. అందులో భాగంగానే తాజాగా ఆదివారం మిల్కీబ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. . ఈ నేపథ్యంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన పడ్డారు. అయితే తమన్నా ఆసుపత్రి నుంచి తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే వెల్లడించింది.
గత వారం తనకు స్వల్పంగా జ్వరం వచ్చిందని, దీంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ వచ్చిందని, దీనితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టుగా తమన్నా పేర్కొంది. అయితే ప్రపంచంలోని చాలా మందిని భయపెట్టిస్తున్న కరోనా నుంచి తానూ తొందరగా బయటపడడం అదృష్టం అంది తమన్నా.. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లుగా తమన్నా వెల్లడిచింది. ఇక తానూ తొందరుగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తమన్నా వెల్లడించింది.
ఇక తమన్నా సినిమాల విషయానికి వచ్చేసరికి హీరోయిన్ గా ఆమెకి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న 'సిటీమార్' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె కబడ్డీ కోచ్ గా తమన్నా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా సత్యదేవ్ హీరోగా వస్తున్న 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలు చేసేందుకు కూడా తమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. నితిన్, నభా నటేష్ హీరో హీరోయిన్ లుగా వస్తున్న అంధధూన్ రీమేక్ లో నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటిస్తోంది తమన్నా... ఈ పాత్రకి గాను తమన్నా కోటిన్నర డిమాండ్ చేసిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.