మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు క‌రోనా పాజిటివ్?

Tamannaah Corona positive :ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీలకు వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి

Krishna
Published on: 4 Oct 2020 12:51 PM IST
మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు క‌రోనా పాజిటివ్?
X

Tamannaah Bhatia

Tamannaah Corona positive :ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీలకు వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు క‌రోనా సోకిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.. హైఫీవర్‌తో బాధపడుతున్న తమన్నా ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిందని ఆ వార్తల సారాంశం. అయితే దీనిపైన తమన్నా నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు.. ఇక ఇటీవల తమన్నా తల్లిదండ్రులకి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా వెల్లడించింది.. అయితే ప్రస్తుతం వారు కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక తమన్నా సినిమాల విషయానికి వచ్చేసరికి హీరోయిన్ గా ఆమెకి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న 'సిటీమార్' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె కబడ్డీ కోచ్ గా తమన్నా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా సత్యదేవ్ హీరోగా వస్తున్న 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలు చేసేందుకు కూడా తమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. నితిన్, నభా నటేష్ హీరో హీరోయిన్ లుగా వస్తున్న అంధధూన్ రీమేక్‌ లో నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటిస్తోంది తమన్నా... ఈ పాత్రకి గాను తమన్నా కోటిన్నర డిమాండ్ చేసిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

Krishna

Krishna

Next Story