ఆఫీషియల్ : నితిన్ 'అంధాదున్' రీమేక్‌ లో మిల్కీ బ్యూటి!

Andhadhun Remake : ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు యంగ్ హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని

Krishna
Updated on: 19 Sept 2020 3:40 PM IST
ఆఫీషియల్ :  నితిన్ అంధాదున్ రీమేక్‌ లో మిల్కీ బ్యూటి!
X

Tamannaah Bhatia , nabha natesh , nithin 

Andhadhun Remake : ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు యంగ్ హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. వినోదం, యాక్షన్, పాటలు వేటికవే ప్రధాన ఆకర్షణగా నిలవడంతో సినిమాని ప్రేక్షకులు భారీ హిట్ చిత్రంగా మలిచారు. ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'అంధాదున్' సినిమాను రిమేక్ చేస్తున్నాడు.. ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్ చేస్తున్నాడు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తానే సొంతగా నిర్మిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌ర‌గుతున్నాయి.అయితే సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా నభా నటేష్, ఓ కీలక పాత్రలో తమన్నా నటించనుందని అధికారికంగా వెల్లడించింది.

ఇక ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ని నవంబర్‌లో మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు వచ్చే సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.



Krishna

Krishna

Next Story