Andhadhun Remake : నితిన్ తో నభా నటేష్?

Andhadhun Remake : ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు యంగ్ హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్

Krishna
Published on: 28 Aug 2020 4:30 PM IST
Andhadhun Remake : నితిన్ తో నభా నటేష్?
X

Nabha Natesh,Nithin

Andhadhun Remake : ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు యంగ్ హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. వినోదం, యాక్షన్, పాటలు వేటికవే ప్రధాన ఆకర్షణగా నిలవడంతో సినిమాని ప్రేక్షకులు భారీ హిట్ చిత్రంగా మలిచారు. ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచిన 'అంధాదున్' సినిమాను రిమేక్ చేస్తున్నాడు.. ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచిన 'అంధాదున్' సినిమాను రిమేక్ చేస్తున్నాడు.. ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను నితిన్ చేయడానికి సిద్దం అయ్యాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తానే సొంతగా నిర్మిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌ర‌గుతున్నాయి.

అయితే ఈ సినిమాలో నితిన్ సరసన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫేం నభా నటేష్‌ని ఎంపిక చేశారని తెలుస్తోంది.. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శ్రియను తీసుకున్నట్టుగా సమాచారం.. అటు నభా నటేష్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన 'అంధాదున్' సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు వచ్చే సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.

Krishna

Krishna

Next Story