Andhadhun Remake : నితిన్ 'అంధాదున్' : రమ్యకృష్ణ ప్లేస్ లో మరో సీనియర్ నటి?

Andhadhun Remake : ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు యంగ్ హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్

Krishna
Published on: 27 Aug 2020 11:03 AM IST
Andhadhun Remake : నితిన్ అంధాదున్ : రమ్యకృష్ణ ప్లేస్ లో మరో సీనియర్ నటి?
X

Nithin, Shriya Saran

Andhadhun Remake : ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు యంగ్ హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. వినోదం, యాక్షన్, పాటలు వేటికవే ప్రధాన ఆకర్షణగా నిలవడంతో సినిమాని ప్రేక్షకులు భారీ హిట్ చిత్రంగా మలిచారు. ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచిన 'అంధాదున్' సినిమాను రిమేక్ చేస్తున్నాడు.. ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను నితిన్ చేయడానికి సిద్దం అయ్యాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తానే సొంతగా నిర్మిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌ర‌గుతున్నాయి.

అయితే 'అంధాదున్' సినిమాలో కీలకమైన పాత్ర పోషించిన టబు పాత్ర కోసం నటి రమ్యకృష్ణను ముందుగా అనుకున్నారు దర్శకనిర్మాతలు.. అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆ ప్లేస్ లో మరో సీనియర్ నటి శ్రియను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఒకే చెప్పినట్టు సమాచారం.. నెగిటివ్ షెడ్ పాత్రలో శ్రియ కనిపిస్తుంది.. ఇక దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది.. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాకి సంబంధించిన మిగతా నటీనటులను త్వరలో ఎంపిక చేయనుంది చిత్రబృందం.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు వచ్చే సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.

Krishna

Krishna

Next Story