నితిన్ సినిమాలో విలన్ గా రమ్యకృష్ణ?

నితిన్ సినిమాలో విలన్ గా రమ్యకృష్ణ?
x
Nithin, Actress Ramyakrishna
Highlights

ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.

ఈ ఏడాది భీష్మ సినిమాతో అకట్టుకున్నాడు హీరో నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. వినోదం, యాక్షన్, పాటలు వేటికవే ప్రధాన ఆకర్షణగా నిలవడంతో సినిమాని ప్రేక్షకులు భారీ హిట్ చిత్రంగా మలిచారు.

ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచిన 'అంధాదున్' సినిమాను రిమేక్ చేస్తున్నాడు.. ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను నితిన్ చేయడానికి సిద్దం అయ్యాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తానే సొంతగా నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌ర‌గుతున్నాయి.

అయితే 'అంధాదున్' సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించిన టబు పాత్ర కోసం నటి రమ్యకృష్ణ ను అనుకుంటున్నారు దర్శకనిర్మాతలు..సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర కావడంతో ఈ పాత్రకి నటి రమ్యకృష్ణ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుందట! ఆ పాత్రను పోషించడానికి కూడా రమ్యకృష్ణ ఆసక్తిని కనబరుస్తునట్టుగా సమాచారం.. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాకి సంబంధించిన నటీనటులను త్వరలో ఎంపిక చేయనుంది చిత్రబృందం.

ఇక ఈ సినిమాతో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కూడా రమ్యకృష్ణ ఓ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ గ్రాప్ లో తెరకేక్కుతున్న ఈ సినిమాలో ఓ పొలిటికల్ లీడర్ గా ఆమె కనిపించనున్నారు. అంతేకాకుండా తన భర్త, దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగామార్తండ సినిమాలో కూడా ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories