sai kumar about Eshwar allah movie : అప్పు తీర్చడం కోసం అయన ఏకంగా 15 సినిమాలు చేశార‌ట‌!

నటుడు సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విలక్షణ నటుడుగా అయన టాలీవుడ్ లో మంచి పేరుంది. ఇక పోలిస్

Update: 2020-07-30 17:26 GMT
sai kumar (File Photo)

sai kumar about Eshwar allah movie : నటుడు సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విలక్షణ నటుడుగా అయన టాలీవుడ్ లో మంచి పేరుంది. ఇక పోలిస్ పాత్రలకి పెట్టింది పేరు ఆయన.. కనిపించే మూడు సింహాలు చ‌ట్టానికి, న్యాయానికి, ధ‌ర్మానికి ప్రతిరూపాలైతే.. క‌నిపించ‌ని ఆ నాలుగో సింహమే రా పోలీస్ అంటూ పోలీస్ స్టోరీ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ అయన కెరీర్లోనే ఆల్ టైమ్ ఫేవ‌రేట్ డైలాగ్... ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అయన తన సినీ జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సాయి కుమార్ యాక్షన్ జోన‌ర్ లో ఈశ్వర్ అల్లా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా 1998లో విడుదలైంది. ఈ సినిమాకి సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప శ‌ర్మ దర్శకత్వం వహించారు. ఇందులో సాయి కుమార్ సరసన సౌందర్య హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాను అప్పట్లో లోనే రూ.2 కోట్ల బ‌డ్జెట్ తో తెరకెక్కించారు. అప్పట్లో రెండు కోట్ల అంటే భారీ బడ్జెట్ అన్నమాట‌.

అయితే ఆ సినిమాకి డిస్ట్రిబ్యూట‌ర్లు ఎవరు ముందుకు రాక‌పోవ‌డంతో సినిమా భారీగా నష్టపోయింది. దీంతో ఆ సినిమాకి రూ. 2 కోట్లు అప్పు మిగిలింద‌ట. అయితే ఈ సినిమాకి న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు సాయి కుమార్ ఏకంగా 15 సినిమాలు చేశార‌ట‌. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం సాయి కుమార్ శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న శ్రీకారం అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా అయన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుదల చేసిన అయన లుక్ ఆకట్టుకుంది. 

Tags:    

Similar News