Funky Movie: సింగర్‌గా మెప్పించి.. నటిగా అదరగొడుతోంది.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’లో ‘జై బాలయ్య’ సింగర్!
Funky Movie: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky).
Funky Movie: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky). ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ సోదరిగా ఒక కీలక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది అదితీ భావరాజు.
సింగర్ టు యాక్ట్రెస్:
తెలుగు సంగీత ప్రియులకు అదితీ భావరాజు పేరు సుపరిచితమే. ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ప్రసారమైన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ షోలో టాప్-5 కంటెస్టెంట్‌గా నిలిచి అదితీ తన ప్రతిభను చాటుకుంది. ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్‌గా ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రంలోని ‘జై బాలయ్య’ సాంగ్ అదితీకి ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టింది. కీరవాణి, తమన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద ఆమె పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.
రెండో సినిమాలోనూ సత్తా చాటిన అదితి:
సింగర్‌గా రాణిస్తూనే నటనపై ఉన్న ఆసక్తితో అదితీ వెండితెరపై అడుగుపెట్టారు. గతంలో ‘దండోరా’ చిత్రంలో ఒక కీలక పాత్రలో మెరిసిన ఆమెకు, ‘ఫంకీ’ రెండో సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సోదరిగా ఎంతో సహజంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
డైరెక్టర్, హీరోలకు థాంక్స్:
తన నటనకు వస్తున్న స్పందన పట్ల అదితీ భావరాజు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. షూటింగ్ స్పాట్‌లోని స్టిల్స్‌ను షేర్ చేస్తూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన హీరో విశ్వక్ సేన్ మరియు డైరెక్టర్ అనుదీప్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.