మీ సంతోషమే నాకు ముఖ్యం .. మీరంతా దూరంగా ఉండాలి : రామ్
ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్' .. తమిళంలో మంచి విజయం సాధించిన 'తడమ్' చిత్రానికి రీమేక్‌గా 'రెడ్' తెరకెక్కుతుంది.
ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్' .. తమిళంలో మంచి విజయం సాధించిన 'తడమ్' చిత్రానికి రీమేక్‌గా 'రెడ్' తెరకెక్కుతుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్రవంతి రవికిషోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలు. కరోనా పరిస్థితుల రీత్యా ఏప్రిల్ 9న విడుదల కావాల్సిన ఈ మోవీకి ప్రస్తుతానికి వాయిదా వేశారు. తమిళంలో మంచి విజయం సాధించిన 'తడమ్' చిత్రానికి రీమేక్‌గా 'రెడ్' తెరకెక్కుతుంది.
యువ హీరో రామ్ లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. అభిమానులు తనపై చూపించే ప్రేమ కంటే ఎక్కువగా తాను వాళ్లని ప్రేమిస్తున్నానని ట్విటర్ వేదికగా అభిమానులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే భౌతిక దూరం తప్పకుండా పాటించాలని, కాబట్టి ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరపొద్దని ఆయన కోరారు.
నా ప్రియమైన అభిమానులకు.. మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏటా మే 15న నా పుట్టినరోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో, అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరే నా సంతోషం.. నా ఎనర్జీ.. నా ప్రాణం.. అంతకు మించి నా బాధ్యత..! ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల రీత్యా ఈ సారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం..! ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే.. నాకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను..' అని రామ్ పేర్కొన్నారు.