వీడియో ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారంటూ పృథ్వీ ఫిర్యాదు

సినీనటుడు, ఎస్వీబీసీ ( శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ) మాజీ ఛైర్మన్ పృథ్వీ రాజ్ మరోసారి వార్తల్లోకి నిలిచారు.

Update: 2020-04-28 02:28 GMT
Prudhvi Raj (File Photo)

సినీనటుడు, ఎస్వీబీసీ ( శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ) మాజీ ఛైర్మన్ పృథ్వీ రాజ్ మరోసారి వార్తల్లోకి నిలిచారు. అయన సోషల్ మీడియా యాప్‌లలో చేసిన తన వీడియోలను కొందరు వ్యక్తులు ఎడిట్ చేసి కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఏప్రిల్ 27 సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పృథ్వీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పృథ్వీ వీడియోలను ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు సోషల్ మీడియా లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా పృథ్వీరాజ్ టిక్ టాక్ వీడియోలో..' మన ఎవరినీ నమ్మొద్దు. ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట మాట్లాడతారు. వాడి ముందు వాడి మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ' అంటూ ఆయన వీడియో చేశారు. ఇక ఆ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News