Thug Life OTT: సైలెంట్‌గా ఓటీటీలో అడుగుపెట్టిన ‘థగ్ లైఫ్’ – తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్
Thug Life OTT: కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన హైప్‌ఫుల్ సినిమా ‘థగ్ లైఫ్’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
Thug Life OTT: సైలెంట్‌గా ఓటీటీలో అడుగుపెట్టిన ‘థగ్ లైఫ్’ – తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్
Thug Life OTT: కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన హైప్‌ఫుల్ సినిమా ‘థగ్ లైఫ్’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర విఫలమైంది. విడుదలైన నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఈ సినిమా ఓటీటీ వేదికపైకి వచ్చేసింది.
అదేంటంటే – ఏ మాత్రం హడావుడి లేకుండా, జులై 2 అర్ధరాత్రి తరువాతే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సౌత్ అధికారిక పేజీ ద్వారా వెల్లడించారు.
ఐదు భాషల్లో ‘థగ్ లైఫ్’ స్ట్రీమింగ్
ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం (ఒరిజినల్), తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ట్వీట్‌లో:
“ఇది రంగరాయ శక్తివేల్, యముడి మధ్య పోటీ. థగ్ లైఫ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ భాషల్లో అందుబాటులో ఉంది,” అని పేర్కొన్నారు.
అయితే, మొదట జులై 4న స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందనుకున్నారు అభిమానులు. కానీ ఒకరోజు ముందుగానే రాకతో అభిమానుల్లో ఆశ్చర్యం నెలకొంది.
బాక్సాఫీస్ డిజాస్టర్.. ఓటీటీ ఎంట్రీ
థియేటర్లలో ఈ సినిమా ఫలితం చప్పగా ఉండటంతో, నిర్మాతలు భారీ నష్టాలను చవిచూశారు. కలెక్షన్లు బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేకపోయాయి. మరోవైపు, ఓటీటీ ఒప్పందానికి విరుద్ధంగా ముందుగా స్ట్రీమింగ్ చేయడంతో, నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.
రూ.135 కోట్ల ఒప్పందం.. రూ.110 కోట్లకే కుదించాలి
సినిమా విడుదలకు ముందు నెట్‌ఫ్లిక్స్‌తో రూ.135 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్న మేకర్స్, సినిమా ఫెయిల్యూర్ కారణంగా చివరికి ఓటీటీ డీల్‌ను రూ.110 కోట్లకు తగ్గించుకున్నారు.
నెట్‌ఫ్లిక్స్ మొదట్లో రూ.90 కోట్లకే సరిపెడదామని చెప్పినప్పటికీ, మేకర్స్ లాబీయింగ్ ద్వారా మరింతగా దాన్ని పెంచగలిగారు.
ఓటీటీలో రిజల్ట్ ఏమిటి?
థియేటర్లలో ఘోరంగా విఫలమైన ‘థగ్ లైఫ్’కు ఓటీటీ వేదికగా ఎంత స్పందన లభిస్తుందో చూడాలి.
నెగటివ్ టాక్ ఓటీటీలోనూ కొనసాగుతుందా? లేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ఆదరణ దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.