Health Tips: రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే చర్మంపై ఈ లక్షణాలు..!

Health Tips: రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే చర్మంపై ఈ లక్షణాలు..!

Update: 2022-11-16 05:13 GMT

Health Tips: రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే చర్మంపై ఈ లక్షణాలు..!

Health Tips: ఈ రోజుల్లో మధుమేహ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. దీనికి కారణం ప్రజలు శారీరక శ్రమకు దూరం కావడమే. అందుకే రోజు రోజుకి మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. సరైన సమయంలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి జీవనశైలిలో మార్పులు చేయడం వల్ల దీనిని నివారించవచ్చు. రక్తంలో షుగర్‌ స్థాయిలు పెరిగినప్పుడు చర్మంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి ముందుగా తెలుసుకోవాలి.

వాపు, ఎరుపు చర్మం

చర్మం చాలా వేడిగా, వాపు లేదా ఎర్రగా మారినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయికి సంబంధించిన లక్షణం.

దద్దుర్లు, పొక్కులు

చర్మంపై దద్దుర్లు, పొక్కులు ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. అయితే ఈ లక్షణాలు మధుమేహం ఉన్నవారిలో కూడా కనిపిస్తాయి. రక్తంలో చక్కెర పెరగడం వల్ల చర్మంపై దద్దుర్లు, పొక్కులు ఏర్పడుతాయని గుర్తుంచుకోండి.

దురద

డయాబెటిక్ రోగులలో దురద అనేది సర్వసాధారణమైన సమస్య. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు చర్మం పొడిగా మారుతుంది. దీని కారణంగా దురద మొదలవుతుంది.

పొక్కులు

ఈ సమస్య చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ ఇప్పటికే డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్న ఈ రోగులలో బొబ్బలు ఏర్పడతాయి. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ బొబ్బలు వేళ్లు, చేతులు, కాళ్లపై రావచ్చు.

Tags:    

Similar News