ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. అయినా సినిమాకు రాని జనం.. ఏపీలో థియేటర్ల పరిస్థితి ఇది..!

AP Movie Theatres: ఆషాడం ఆఫర్స్‌లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న నినాదం ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్ల వరకు వచ్చింది.

Update: 2022-07-30 15:30 GMT

ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. అయినా సినిమాకు రాని జనం.. ఏపీలో థియేటర్ల పరిస్థితి ఇది..!

AP Movie Theatres: ఆషాడం ఆఫర్స్‌లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న నినాదం ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్ల వరకు వచ్చింది. నిన్నటి వరకు వస్త్ర దుకాణాల్లో, సూపర్ మార్కెట్లలో ఈ ఆఫర్స్‌ను చూసుంటాం. కానీ సినిమా థియేటర్లలోనూ ఈ తరహా బోర్డ్‌లు కనిపించడం షాకిస్తోంది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ ఏపీలోని కొన్ని థియేటర్ల ముందు బోర్డ్‌లు వెలుస్తున్నాయి. దీంతో ఏపీలో తెలుగు సినిమాకు, థియేటర్లకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టుగా తెలుస్తోంది.

కొన్ని నెలలుగా తెలుగు సినిమా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడం వేసిన సెట్లే మళ్లీ వేయడం ఆర్టిస్ట్‌ల కాల్షీట్‌లు పెరిగిపోవడం వంటి కారణాలతో ఆర్థిక భారం పెరిగి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ఓటీటీల ప్రభావం, టికెట్ రేట్లు పెరగడంతో ప్రేక్షకులు ఆ భారీ మొత్తాలను వెచ్చించలేక థియేటర్లకు ముఖం చాటేస్తున్నారు. దీంతో థియేటర్ల యజమనులకు నిర్వాహణ భారంగా మారుతూ వస్తోంది. దీంతో ఒక్క టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ ఏపీలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద బోర్డ్‌లు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రధానంగా బీ, సీ సెంటర్లలో ఎక్కువగా కనిపిస్తుండటం విచారకరమైన విషయం.

ఈ మధ్య విడుదలైన మీడియం రేంజ్ సినిమాలకు ఏపీలోని బీ, సీ సెంటర్లలో సినిమాలు చూడటానికి జనాలు కరువయ్యారు. కాస్తో కూస్తో పేరున్న హీరో, నిర్మాతలు తీసిన సినిమా అయినా కూడా ఎవరూ థియేటర్లకు రాకపోవడంతో, థియేటర్ల వద్ద టికెట్ డిస్కౌంట్ బోర్డ్‌లు పెడుతున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడులోని థియేటర్ ముందు ఒకటి టికెట్ కొంటే మరొకటి ఫ్రీ అని బోర్డులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఇలా టికెట్లకు డిస్కౌంట్ బోర్డ్‌లు పెట్టినా మూడు రోజుల్లో థియేటర్ కు వచ్చింది కేవలం ఆరుగురే ప్రేక్షకులేనంట. తాజా సంఘటన ఏపీలో సినిమా‌ థియేటర్ల పరిస్థితి మరింత దయనీయ స్థితికి చేరిందని స్పష్టం చేస్తోంది. టికెట్ రేట్లు ఇష్టాను సారం పెంచడం, ఓటీటీ ప్రభావం పతాక స్థాయికి చేరడం వల్లే సినిమా థియేటర్లకు ఈ దుస్థితి పట్టిందంటున్నారు. కానీ మంచి కంటెంట్ ఉంటే సినిమాలను ప్రజలు చూస్తారని, చిత్ర పరిశ్రమను ఆదరించమని ప్రేక్షకులని ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఒక్కరు కాదు ఇద్దరు కలిసి 70 రూపాయలతో సినిమా చూడవచ్చని థియేటర్ల వారు ఆఫర్లు ఇచ్చినా జనం ఆసక్తిని చూపించకపోవడంతో, తెలుగు సినిమాల పరిస్థితి మరీ దారుణంగా మారిందని ఇండస్ట్రీ వర్గాలవారంటున్నారు. ‌దీనిపై పలుమార్లు సమావేశాలు జరుపుతూ వస్తున్నారు. ఆగస్ట్ నుంచి చిత్రీకరణలు కూడా ఆపేందుకు సిద్దమవుతున్నారు. ‌తాజాగా ఆగస్ట్ 2న మరోసారి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఛాంబర్‌తో సమావేశం కానున్నారు‌. సినిమాకు ఆదరణ తగ్గిన పరిస్దితుల నేపథ్యంలో, పర్సెంటేజ్ విధానాన్ని అమలు పరచాలని, థియేటర్స్ యాజమాన్యాలు డిమాండ్ చెసేందుకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News