Thaman: ఇది చాలా పెద్ద విషయం అంటున్న థమన్

Thaman: చిరు సల్మాన్ పాట ఎలా ఉండబోతోందో చెబుతున్న థమన్

Update: 2021-11-15 13:15 GMT

చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ సాంగ్ ఎలా ఉండబోతుందో చెప్పిన థమన్ (ఫైల్ ఇమేజ్)

Thaman: ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వంలో "లూసిఫర్" సినిమా రీమేక్ తో బిజీగా ఉన్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ను ఖరారు చేసారు దర్శనిర్మాతలు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిన విషయమే. అయితే తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాలో చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ తో ఒక పాట చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారట. ఈ పాటలో చిరంజీవి సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులు వేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న ఎస్.ఎస్.తమన్ ఇలా అన్నారు. "చిరు సార్ నా దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఒక పాటలో ఆయన మరియు సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేయబోతున్నారు అని చెప్పారో అప్పుడే నాకు అర్థమైంది ఇది చాలా పెద్ద విషయం అని. ఇది ఒక ధీమాటిక్ పాట. దీనికి ఒక మంచి వైబ్ మరియు స్పంక్ ఉంటాయి. చిరు సర్ పాటలకే సింగ్ సంగీతం కంపోజ్ చేయడం చాలా కష్టమైన పని ఇప్పుడు ఇద్దరు లెజెండ్స్ ఉన్న పాటకి సంగీతం అంటే ఎలా ఉంటుందో మీరే ఊహించవచ్చు. అంతేకాకుండా హిందీ కంపోజర్ లోకి కూడా నా గురించి తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలు దాటి నా సంగీతం వెళ్లేందుకు నాకు ఇదొక మంచి అవకాశం".

Tags:    

Similar News