Beast Movie Review: "బీస్ట్" గా విజయ్ నటన అద్భుతం కానీ సినిమా మాత్రం...

Beast Movie Review: ఈ మధ్యనే మాస్టర్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ విజయ్...

Update: 2022-04-13 07:31 GMT

Beast Movie Review: "బీస్ట్" గా విజయ్ నటన అద్భుతం కానీ సినిమా మాత్రం...

Beast Movie Review:

చిత్రం: బీస్ట్

నటీనటులు: విజయ్, పూజ హెగ్డే, సెల్వ రాఘవన్, యోగి బాబు, బిజార్న్ సుర్రావ్, వీటివి గణేష్, అపర్ణ దాస్, తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

నిర్మాత: కళానిధి మారన్

దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్

బ్యానర్: సన్ పిక్చర్స్

విడుదల తేది: 13/04/2022

ఈ మధ్యనే మాస్టర్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ విజయ్ తాజాగా ఇప్పుడు "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుణ్ డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. యాక్షన్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి తాజాగా ఇవాళ అనగా ఏప్రిల్ 13, 2022 న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో కూడా "బీస్ట్" అనే టైటిల్తో విడుదలైన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

వీర రాఘవన్ (విజయ్) ఒక రా ఏజెంట్. కానీ తను ఒక మిషన్ లో ఉన్న సమయంలో ఒక సామాన్య పౌరుడి ప్రాణాలు పోవడంతో వీర రాఘవన్ తన జాబ్ మానేస్తాడు. ఆ పిల్లాడి చావుకి తానే కారణమని డిప్రెషన్ లో ఉన్న వీర రాఘవన్ ప్రీతి (పూజ హెగ్డే) అనే సైకియాట్రిస్ట్ ను కలుస్తాడు. వారిద్దరూ కలిసి ఒకసారి చెన్నైలోని ఒక మాల్ కి వెళ్లగా, ఆ మాల్ ని ఒక ఆర్గనైజేషన్ వాళ్లు హైజాక్ చేస్తారు. అప్పుడే అరెస్టయిన తమ హెడ్ ఉమర్ ఫరూక్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. టెర్రరిస్టుల వద్ద బందీలుగా ఉన్న వీరరాఘవన్ ఎలా ఆ మాల్ లో ఉన్న సామాన్యులను కాపాడతాడు అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

రా ఏజెంట్ గా విజయ్ నటన ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. తన పాత్రలో ఒదిగిపోయి విజయ్ చాలా బాగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా విజయ్ నటన అద్భుతంగా ఉంది. ఇక పూజా హెగ్డే కి ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకినప్పటికీ తన పాత్ర పరిధిలో బాగానే నటించింది. అందంతో పాటు అభినయం తో కూడా ఆకట్టుకుంది పూజ. విజయ్ తో తన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సెల్వరాఘవన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఆయన నటన ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. వీ టీవీ గణేష్, యోగి బాబు, సతీష్ ఈ సినిమాలో మంచి కామెడీ ని పంచిపెట్టారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఎలాంటి జోనర్ అయినా దాన్ని తనదైన స్టైల్ లో కామెడీగా మార్చటం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకుముందు కూడా కొలమావు కోకిల, డాక్టర్ వంటి సినిమాలలో కూడా సీరియస్ బ్యాక్ డ్రాప్ లో కామెడీను జనరేట్ చేశారు నెల్సన్. ఈ సినిమాలో కూడా అదే విధంగా కామెడీ పండించేందుకు ప్రయత్నం చేశారు కానీ అన్ని చోట్ల అది వర్కవుట్ అవ్వలేదు. కమెడియన్స్ బోలెడు మంది ఉన్నప్పటికీ విజయ్ పాత్రతో ఎక్కువ కామెడీ జనరేట్ చేయాలి అనుకున్న నెల్సన్ మొదటి హాఫ్ తో బాగానే పెంచినప్పటికీ రెండవ హాఫ్ లో అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ఇప్పటికే అరబిక్ కుత్తు, జోలీ వంటి పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. వెండి తెరపై కూడా ఆ పాటలు బాగానే మెప్పించాయి. మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్ ను అందించారు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

విజయ్ నటన

కొన్ని కామెడీ సన్నివేశాలు

సంగీతం

బలహీనతలు:

రొటీన్ కథ

ప్రాధాన్యత లేని పాత్రలు

చివరి మాట:

సినిమా కథ ఆసక్తిగానే మొదలవుతుంది. మొదటి హాఫ్ లో చాలా వరకు డైరెక్టర్ కామెడీ మీద ఫోకస్ చేశారు. కమెడియన్లు చాలా మంది ఉన్నప్పటికీ వీటివీ గణేష్ కామెడీ మాత్రమే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. సెల్వరాఘవన్ పాత్ర కూడా చాలా బాగా రూపొందించారు. ఇక మొదటి హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ కొంచెం డల్ గా అనిపిస్తుంది. అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా అంతగా ఆమె పెంచకపోవడం తో సినిమా కొంచెం బోర్ కొడుతుంది. విజయ్ తన అద్భుతమైన నటనతో చాలా వరకు ఇలాంటి డల్ మూమెంట్స్ ని కవర్ చేశారు కానీ కథలు కొంచెం లాగ్ ఉండడం సినిమాకి మైనస్ గా నిలిచింది. ఓవరాల్గా "బీస్ట్" సినిమా కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అద్భుతంగా ఉంది.

బాటమ్ లైన్:

"బీస్ట్" గా విజయ్ నటన అద్భుతం కానీ సినిమా మాత్రం యావరేజ్.

Tags:    

Similar News