Mirai Teaser: తేజ సజ్జా 'మిరాయ్' నుంచి బిగ్ అప్‌డేట్..

Mirai Teaser: హనుమాన్’ మూవీతో తేజ సజ్జా క్రేజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2025-05-26 11:58 GMT

Mirai Teaser: తేజ సజ్జా 'మిరాయ్' నుంచి బిగ్ అప్‌డేట్..

Mirai Teaser: హనుమాన్’ మూవీతో తేజ సజ్జా క్రేజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయిన తేజ, తన తర్వాతి సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘మిరాయ్’ అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం తేజ సజ్జా మరోసారి కంప్లీట్ మేకోవర్ చేసుకుని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ చిత్రంలో మనోజ్ మంచు విలన్ పాత్రలో కనిపించనుండగా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మూవీ టీం exciting అప్డేట్ ఇచ్చింది. మే 28న ‘మిరాయ్’ టీజర్ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టీజర్ రాగానే సినిమా మీద హైప్ కొత్త లెవెల్‌కి వెళ్లనుందని, మేకర్స్ చెబుతున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో తేజ సజ్జా రన్నింగ్ ట్రైన్‌పై ధైర్యంగా పరుగులు తీస్తూ కనిపించడంతో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఇక ఈ మూవీ మీద రానా దగ్గర నుంచీ కూడా స్పెషల్ ప్రొమోషన్ మొదలైంది. రానా కూడా ‘మిరాయ్’ సినిమాపై అంచనాలు పెంచేలా తనవంతుగా మద్దతు ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2డీ, 3డీ ఫార్మాట్లలో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదల తేదీకి ముందే, టీజర్‌తోనే సినిమాపై అంచనాలు గరిష్ఠానికి చేరనున్నాయి.

Tags:    

Similar News