Tollywood: టాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్న తలపతి?

Tollywood: వంశీ పైడిపల్లి.. తమిళ సూపర్ స్టార్ తలపతి సినిమాకు దర్శకత్వం చేసేందుకు సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు

Update: 2021-05-05 12:13 GMT

విజయ్ & వంశీ పైడిపల్లి 

Tollywood: "మహర్షి" తర్వాత ఇంకా ఏ ప్రాజెక్టును చేపట్టని వంశీ పైడిపల్లి.. తమిళ సూపర్ స్టార్ తలపతి సినిమాకు దర్శకత్వం చేసేందుకు సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం, వంశీ, తలపతి విజయ్ కి స్క్రిప్ట్ ను కూడా వినిపించాడని టాక్. "మాస్టర్" నటుడు స్క్రిప్ట్ కు ఓకే కూడా చెప్పాడని తెలుస్తోంది. ఈ చిత్రంతో విజయ్ టాలీవుడ్‌లోకి తొలి తెలుగు చిత్రంగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి చిత్రీకరించబడుతుంది. అలాగే ఏకకాలంలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.

విజయ్ తన లేటెస్ట్ సినిమా "మాస్టర్" తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదరగొట్టాడు. ఈ చిత్రం పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందంట. ఇది నిజంగా చిత్రనిర్మాతలకు లాభాలను తెచ్చిపెంట్టిందంట. ఈ విజయంతో దిల్ రాజు విజయ్ తో స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ సినిమాకు విజయ్ కూడా ఓకే చెప్పడంతో.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తలపతి 66 వ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంట.

విజయ్ నటించే "తలపతి 65" వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఈ సినిమాను మార్చిలో ప్రారంభించారు. అయితే, కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

Tags:    

Similar News