Tamannaah: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా
Tamannaah: పెళ్లి విషయంపై నోరు విప్పిన మిల్కీ బ్యూటీ
Tamannaah: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటు తెలుగులో మాత్రమే కాక అటు తమిళ్ మరియు హిందీ భాషల్లో కూడా తనదైన శైలిలో మంచి సినిమాలు చేస్తూ కరియర్లో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ వంటి హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు కానీ తమన్నా మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది. అయితే ఈమె ఒక బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది అని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
కానీ దీని గురించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలబడలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి విషయం గురించి స్పందించింది తమన్నా."నా అభిమానులు నాపై చూపించే ప్రేమ నన్ను ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నా కరియర్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చేసిన పాత్రలను అభిమానులకు గర్వంగా చూపించగలను. అలానే నేను చేసుకోబోయే వాడిని కూడా అంతే గర్వంగా ప్రకటించాలని అనుకుంటున్నాను.
దీనిలో దాచడానికి ఏమీ లేదు. నాకు ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. ఇంట్లో కూడా నామీద పెళ్లి గురించి ఒత్తిడి తీసుకురావడం లేదు. మీడియాలో చాలాసార్లు నా పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. ఏదైనా ఉంటే నేనే ముందు మీకు చెబుతాను. ఈ వయసు లోపల పెళ్లి చేసుకోవాలని టార్గెట్లు నాకేమీ లేవు. ఆ రోజు వస్తే కచ్చితంగా గర్వంగా ప్రకటిస్తాను," అని స్పష్టం చేసింది తమన్నా.