Tamannaah Bhatia: బోలెడు సినిమాలను తిరస్కరించిన మిల్కీబ్యూటీ
Tamannaah Bhatia: వరుసగా సినిమాలు చేస్తున్న తమన్నా చాలా సినిమాలు రిజెక్ట్ కూడా చేసిందట...
Tamannaah Bhatia: బోలెడు సినిమాలను తిరస్కరించిన మిల్కీబ్యూటీ
Tamannaah Bhatia: స్టార్ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో ను జత కడుతూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతోంది. తెలుగులో మాత్రమే కాక తమిళంలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా, బాహుబలి సినిమాతో ఇండియన్ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్న తమన్నా వెంకటేష్ తో "ఎఫ్ 2" సినిమా లో, "సైరా నరసింహారెడ్డి" లో చిరంజీవి సరసన నటించింది. అయితే వరుసగా సినిమాలు చేస్తున్న తమన్నా చాలా సినిమాలు రిజెక్ట్ కూడా చేసిందట. అందులో మొదటిది బాలకృష్ణ మరియు ప్రగ్య లు హీరోహీరోయిన్లుగా నటించిన "అఖండ". ఈమె వద్దన్నాకే ఈ ఆఫర్ ప్రగ్య కి వెళ్లిందట.
మరోవైపు తేజ డైరెక్షన్ లో వెంకీ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం అడగగా, ఆ సినిమాని కూడా రిజెక్ట్ చేసింది ఈ బ్యూటీ. మరోవైపు విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాను కూడా తిరస్కరించింది. ఇది మాత్రమే కాక రవితేజ "ఖిలాడీ", నాగ చైతన్య "సవ్యసాచి" "రాజు గారి గది", "నీ జతగా నేనుండాలి", "స్పీడున్నోడు", "శివం", "స్పైడర్" సినిమాలను కూడా తమన్నా వద్దనుకుందట.