Taapsee Pannu: దెబ్బకు దిగొచ్చిన హీరోయిన్.. తెలుగు సినిమాలే నాకు లైఫ్ ఇచ్చాయంటూ యూటర్న్

Taapsee Pannu: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో గ్లామర్ డాల్‌గా ముద్రపడ్డ తాప్సీ, బాలీవుడ్‌కు వెళ్ళాక రూటు మార్చి మహిళా ప్రధాన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2026-02-28 03:13 GMT

Taapsee Pannu: దెబ్బకు దిగొచ్చిన హీరోయిన్.. తెలుగు సినిమాలే నాకు లైఫ్ ఇచ్చాయంటూ యూటర్న్

Taapsee Pannu: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో గ్లామర్ డాల్‌గా ముద్రపడ్డ తాప్సీ, బాలీవుడ్‌కు వెళ్ళాక రూటు మార్చి మహిళా ప్రధాన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది దర్శకుల పనితీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. ముఖ్యంగా గ్లామర్ సన్నివేశాల చిత్రీకరణలో హీరోయిన్లపై ఒత్తిడి ఉంటుందని, కొన్ని సందర్భాల్లో ప్యాడెడ్ బ్రాలు ధరించాలని బలవంతం చేస్తారని ఆమె పేర్కొనడం సంచలనంగా మారింది.

అంతేకాకుండా, బాలీవుడ్‌లో ‘క్లీవేజ్’కు ఇచ్చే ప్రాధాన్యత కంటే, సౌత్‌లో నాభి (బొడ్డు) ప్రదర్శనపై దర్శకులు ఎక్కువ ఫోకస్ పెడతారని ఆమె చేసిన పోలిక తెలుగు ప్రేక్షకులకు రుచించలేదు. తన తొలి సినిమా దర్శకుడు కె. రాఘవేంద్రరావు శైలిని పరోక్షంగా విమర్శించిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు.

తాప్సీ వ్యాఖ్యలపై టాలీవుడ్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. నీకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమానే కదా.. ఇప్పుడు హిందీలో గుర్తింపు రాగానే పాత రోజులను విమర్శిస్తావా? అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఒక దశలో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో తాప్సీ రక్షణలో పడాల్సి వచ్చింది.నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చోటే విమర్శలు చేయడం ఆమె సంస్కారానికి నిదర్శనమంటూ నెటిజన్లు ఎద్దేవా చేశారు.

ట్రోల్స్ సెగ గట్టిగా తగిలిందో ఏమో కానీ, తాప్సీ వెంటనే తన మాట మార్చింది. మరో ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ టాలీవుడ్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది.నాకు నటిగా గుర్తింపు ఇచ్చింది, కెరీర్‌కు పునాది వేసింది తెలుగు సినిమాలే అని పేర్కొంది.తమిళం కంటే తెలుగు ప్రేక్షకులు తనను ఎక్కువగా ఆదరించారని, తన ఎదుగుదలలో టాలీవుడ్ పాత్ర మరువలేనిదని ప్రశంసలు కురిపించింది.తెలుగులో కేవలం గ్లామర్ మాత్రమే కాదు, 'గుండెల్లో గోదారి' వంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా లభించాయని గుర్తు చేసింది.

తాప్సీ తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఆమె తన తప్పు తెలుసుకుందని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం "సినిమా ప్రమోషన్ల కోసం వివాదాలు సృష్టించి, ఆపై మాట మార్చడం ఆమెకు అలవాటే" అని విమర్శిస్తున్నారు.

ఏదేమైనా, 'ఝుమ్మంది నాదం'తో మొదలైన తాప్సీ ప్రయాణం నేడు 'థప్పడ్', 'పింక్' వంటి చిత్రాలతో శిఖరాగ్రానికి చేరింది. అయితే, కెరీర్ ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను గౌరవించడం ముఖ్యం అనే సందేశాన్ని ఈ వివాదం ఆమెకు గట్టిగానే ఇచ్చిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News