Burak Ozcivit: ఇదేం పిచ్చి.. సెలబ్రిటీ కోసం రూ.30 కోట్లు ఖర్చు చేసిన యువతి
Celebrity Culture: ఒకప్పుడు నటులంటే కేవలం వెండితెరపై కనిపించే కళాకారులు మాత్రమే. కానీ నేడు వారు 'గ్లోబల్ బ్రాండ్‌లు'. వారు వేసే అడుగు, వేసుకునే డ్రెస్, చివరకు వారు పలకరించే పలకరింపు కూడా కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా మారిపోయింది.
Celebrity Culture: ఒకప్పుడు నటులంటే కేవలం వెండితెరపై కనిపించే కళాకారులు మాత్రమే. కానీ నేడు వారు 'గ్లోబల్ బ్రాండ్‌లు'. వారు వేసే అడుగు, వేసుకునే డ్రెస్, చివరకు వారు పలకరించే పలకరింపు కూడా కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా మారిపోయింది. తాజాగా టర్కీ నటుడు బురాక్ ఓజ్చివిట్ విషయంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దుబాయ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు బురాక్ ఓజ్చివిట్‌కు అక్షరాలా 3.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 30 కోట్లు) పారితోషికం లభించింది. అది కూడా కేవలం 15 నిమిషాల పాటు ఒక రిచ్ అరబ్ మహిళ పక్కన కూర్చున్నందుకు మాత్రమే! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. మధ్యప్రాచ్య దేశాల్లో టర్కిష్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్, ముఖ్యంగా బురాక్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ స్థాయి రెమ్యూనరేషన్‌కు కారణమైంది. ఒక మనిషి 15 నిమిషాల సమయం ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితకాల సంపాదన కంటే ఎక్కువ ఉండటం గమనార్హం.
ప్రస్తుతం సెలబ్రిటీ అంటే కేవలం ప్రతిభ ఉన్నవారు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్నవారు. హాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ వరకు, చివరకు చిన్నపాటి యూట్యూబ్ స్టార్ల వరకు అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.కేవలం రిబ్బన్ కటింగ్ లేదా ఒక మాల్ ఓపెనింగ్‌కు హాజరైతే చాలు, నిమిషాల్లో లక్షలు, కోట్లు వచ్చిపడుతున్నాయి.అభిమానుల భావోద్వేగాలే ఇప్పుడు మార్కెట్ విలువను నిర్ణయిస్తున్నాయి. ఒక స్టార్ ఏ కారులో తిరుగుతున్నారు, ఏ బ్రాండ్ టీషర్ట్ వేసుకున్నారు అనేది ఇప్పుడు యూత్ కు ఒక టాపిక్ అయిపోయింది.
ఈ సెలబ్రిటీ కల్చర్ ఎంత వినోదాన్ని పంచుతుందో, అంతకంటే ఎక్కువ సామాజిక అసమానతలను సృష్టిస్తోంది.స్టార్ ఇంట్లో జరిగే చిన్న విషయాన్ని కూడా చర్చించే యువత, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు లేదా సామాజిక సమస్యలపై మౌనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.విద్యావంతులు, శాస్త్రవేత్తలు లేదా సామాజిక సేవకులకు దక్కని గౌరవం, సంపద కేవలం వినోద రంగంలోని వ్యక్తులకే దక్కుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.
సెలబ్రిటీ కల్చర్ అనేది ఇప్పుడు కేవలం వినోదం కాదు.. అది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ. గ్లోబలైజేషన్ పుణ్యమా అని స్టార్ పవర్‌కి హద్దుల్లేకుండా పోయాయి. అయితే, వినోదాన్ని వినోదంగానే చూస్తూ, సామాజిక స్పృహను కోల్పోకుండా ఉండటమే నేటి తరం చేయాల్సిన పని.