‘వైట్ లోటస్’ సిరీస్ ఛాన్స్ మిస్ చేసుకున్న దీపికా?
హాలీవుడ్ ‘ది వైట్ లోటస్’ సీజన్ 4లో అవకాశం వచ్చినా ఆడిషన్‌కు రాకపోవడంతో దీపికా పదుకొనె ఛాన్స్ మిస్ చేసుకుందనే వార్తలు వైరల్.
‘వైట్ లోటస్’ సిరీస్ ఛాన్స్ మిస్ చేసుకున్న దీపికా?
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల తన ప్రాజెక్టుల ఎంపికపై వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో, తాజాగా మరో హాలీవుడ్ అవకాశం కూడా ఆమె చేతులమీదుగా జారిపోయిందనే ప్రచారం సాగుతోంది.
సమాచారం ప్రకారం, ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ‘ది వైట్ లోటస్’ నాల్గవ సీజన్ కోసం దీపికా పేరును పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే పాత్రకు సంబంధించి ఆడిషన్‌కు హాజరు కావాలని మేకర్స్ సూచించగా, తాను ఆడిషన్‌కు రాలేనని ఆమె తెలిపినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ఆమె స్థానంలో మరో నటిని ఎంపిక చేసే దిశగా సిరీస్ బృందం ముందుకు సాగినట్లు సమాచారం.
ఇది అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘XXX: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన దీపికా, ఆ తర్వాత పెద్దగా అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో ‘ది వైట్ లోటస్’ సిరీస్ ద్వారా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు భావించారు.
తాజా పరిణామాలపై దీపికా లేదా సిరీస్ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.