Spirit : ఇంకెన్ని ట్విస్టులు ఇస్తావ్ వంగా.. ! ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో విలన్‌గా ఆ హీరోయిన్
Spirit : సందీప్ రెడ్డి వంగా మరో సర్ప్రైజ్ ప్లాన్.. ‘స్పిరిట్’లో ప్రభాస్‌కు ఎదురు నిలిచే శక్తివంతమైన మహిళా విలన్ పాత్ర!
Spirit : ఇంకెన్ని ట్విస్టులు ఇస్తావ్ వంగా.. ! ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో విలన్‌గా ఆ హీరోయిన్
Aishwarya Desai : డార్లింగ్ ప్రభాస్, 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా.. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా 'స్పిరిట్' మూవీ నుంచి వెలువడిన ఒకే ఒక్క అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం ప్రభాస్ లుక్ కోసమే కాదు, ఈ సినిమాలో విలన్ల ఎంపిక కూడా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది.
బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన పోస్టర్‌లో నోటిలో సిగరెట్, కళ్ళలో ఇంటెన్సిటీతో వివేక్ లుక్ అదిరిపోయింది. వివేక్ ఒబెరాయ్ నెగటివ్ షేడ్స్ చేయడంలో స్పెషలిస్ట్ అని మనకు తెలుసు, కానీ సందీప్ వంగా మార్క్ యాక్షన్ సినిమాలో ఆయన ఇంకెంత వైల్డ్‌గా కనిపిస్తారోనని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.అయితే, ఆ పోస్టర్‌లో వివేక్ పక్కనే బ్లాక్ షేడ్స్ పెట్టుకుని, సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఓ భామ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆమె పేరే ఐశ్వర్య దేశాయ్. ఈ ఒక్క పోస్టర్‌తోనే ఆమె ఎవరా? అని సెర్చ్ ఇంజిన్లను నెటిజన్లు హీటెక్కిస్తున్నారు.ఎవరీ ఐశ్వర్య?.. ఈమె భారత సంతతికి చెందిన అమెరికన్ నటి. 2017లో 'జీనా ఇసీ కా నామ్ హై'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'గల్లీ బాయ్' సినిమాలో నిక్కీ నరైన్‌గా తన నటనతో మెప్పించింది.కేవలం గ్లామర్ మాత్రమే కాదు, మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్‌లో డిగ్రీ పొందిన మేధావి కూడా.
అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఐశ్వర్య దేశాయ్ కేవలం ఒక గ్లామర్ రోల్‌కే పరిమితం కాదట. ప్రభాస్ వంటి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ను ఢీకొనే నెగటివ్ షేడ్స్ ఉన్న 'లేడీ విలన్'గా ఆమె కనిపించనుందని టాక్. వివేక్ ఒబెరాయ్ - ఐశ్వర్య దేశాయ్ జోడీ సినిమాలో మోస్ట్ స్టైలిష్ అండ్ డేంజరస్ విలన్లుగా నిలవబోతున్నారట.
సందీప్ వంగా సినిమాల్లో హీరోయిన్ల కంటే విలన్ల పాత్రలు చాలా క్రూరంగా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ వంటి మాస్ హీరోకు ధీటుగా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యలను దించారంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించవచ్చు. త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఒక్క పోస్టర్‌తోనే ఇంతటి హైప్ క్రియేట్ చేసిన 'స్పిరిట్', మరి విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.