Thalapathy Vijay: విడాకుల వైపుగా దళపతి విజయ్ దంపతులు.. కోర్టు మెట్లెక్కిన వ్యవహారం
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. వీరిద్దరి 26 ఏళ్ల వైవాహిక బంధం విడిపోవడానికి గల కారణాలు ఇవే.
Thalapathy Vijay
Thalapathy Vijay: కోలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు 'దళపతి' విజయ్ భార్య సంగీత సార్ణలింగం విడాకుల కోసం చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని ఆమె కోరుతుండగా, ఈ మేరకు కోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 20న జరగనుంది.
1999, ఆగస్టు 25న విజయ్, సంగీత వివాహం జరిగింది. వీరికి జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, గత రెండు సంవత్సరాలుగా వారు వేర్వేరుగా ఉంటున్నారని తరుచు సోషల్ మీడియాలో వార్తలు వచ్చేవి. కాగా, సంగీత తన పిటిషన్‌లో, విజయ్ మరో నటితో అక్రమ సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించినట్లు తెలుస్తోంది.
Thalapathy Vijay: విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పనుల్లో బిజీగా ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి గతంలో జరిగిన చర్చలు విఫలం అయినట్లు తెలుస్తోంది. దీంతో సంగీత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గతంలో కూడా వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో అనేకసార్లు కథనాలు వచ్చాయి. అయితే, ప్రతిసారీ వాటిని ఖండిస్తూ వచ్చిన విజయ్ కుటుంబం, ఇప్పుడు అధికారికంగా కోర్టు వ్యవహారం బయటకు రావడంతో మౌనం వహిస్తోంది. మరోవైపు విజయ్ నటించిన తాజా చిత్రం 'జననాయగన్' సెన్సార్ సమస్యలతో ఇబ్బందుల్లో ఉండటం గమనార్హం.
Thalapathy Vijay: కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితాన్ని అత్యంత గోప్యంగా ఉంచుకుంటూ వచ్చిన ఈ జంట, ఇప్పుడు బహిరంగంగా విడాకుల వరకు వెళ్లడం వారి అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై ఇరు పక్షాల నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కోర్టు విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.