త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న తాప్సీ

Taapsee Pannu: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న తాప్సీ

Update: 2022-03-08 08:00 GMT

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న తాప్సీ

Taapsee Pannu: టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను ఈ మధ్యకాలంలో తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. పర్ఫామెన్స్ కి ప్రాధాన్యత ఉండే పాత్రలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకుపోతుంది ఈ భామ. అయితే గత కొంత కాలంగా తాప్సీ ఒక ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో అనే వ్యక్తి తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి పలు సార్లు వెకేషన్ కు వెళ్లి కెమెరా కంటికి కూడా చిక్కారు. కానీ వీరిద్దరు అధికారికంగా దీని గురించి ప్రకటించలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం అతి త్వరలోనే తాప్సీ మరియు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాప్సీ కూడా తన పెళ్లి గురించి అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు తెలుగులో ఈమెకు ఆఫర్లు ఎక్కువగా లేకపోయినా బాలీవుడ్లో మాత్రం ఈమె చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మధ్యనే "లూప్ లపేట" అనే ఒక టైం లూప్ సినిమాలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన తాప్సీ చేతిలో ప్రస్తుతం "మిషన్ ఇంపాజిబుల్", "బ్లర్", "వో లడకి హై కహా", "శభాష్ మితు", "దుబారా" ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.

Tags:    

Similar News