Sushant Singh Rajput : గంగూలీ బయోపిక్ సుశాంత్ డ్రీం ప్రాజెక్ట్ .. ఈడీ విచారణలో ఆసక్తికర విషయాలు
Sushant Singh Rajput : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు సీబీఐతో పాటు
Sushant Singh, Sourav Ganguly
Sushant Singh Rajput : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు సీబీఐతో పాటు ఈడీ కూడా విచారణ చేస్తోంది. విచారణలో భాగంగా సుశాంత్ వ్యాపార సహచరుడు వరుణ్ మాథూర్ ని విచారించారు. అయితే ఈ విచారణలో వరుణ్ మాథూర్ సుశాంత్ కొన్ని కీలకమైన విషయాలను బయట పెట్టారు..
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బయోపిక్ లో అదరగొట్టిన సుశాంత్.. అంతటితో ఆగకుండా ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటించేందుకు చాలా ఆసక్తి చూపించాడని వెల్లడించారు. ఇది అతని డ్రీం ప్రాజెక్ట్ అని, దీనిని తన స్వీయ నిర్మాణంలో చేయాలనీ అనుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక సమావేశం కూడా జరిగినట్టుగా వెల్లడించాడు. గంగూలీతో పాటుగా మహత్మా గాంధీ, మదర్ థెరిస్సా, స్వామి వివేకానంద, రవీంద్రనాద్ ఠాగూర్ పాటు మొత్తం 12 పాత్రలతో ఓ సినిమా చేయాలని సుశాంత్ భావించినట్టుగా వరుణ్ మాథూర్ వెల్లడించారు.
ఇక సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి తన బ్యాంకు ఖాతా నుంచి రూ .15 కోట్లు వసూలు చేశారని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఈడి ప్రస్తుతం మనీలాండరింగ్ కేసును విచారిస్తోంది . రియాతో స్నేహం చేస్తున్న జాతీయ స్థాయి బిలియర్డ్స్ ప్లేయర్ రిషబ్ ఠక్కర్‌ను కూడా ఫెడరల్ ఏజెన్సీ ప్రశ్నించనుంది. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కేసులో లింకుల కోసం అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020 న తన బాంద్రా నివాసంలో చనిపోయిన సంగతి తెలిసిందే.