Sushant Singh Rajput case: ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఎన్‌సీబీ

Sushant Singh Rajput case: ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఎన్‌సీబీ
x
Highlights

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో..

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ డ్రగ్‌ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారం అరెస్ట్‌ చేసింది. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు అబ్దుల్ బాసిత్ పరిహార్ గా తెలుస్తోంది. పరివార్ కు శామ్యూల్ మిరాండా తో పరిచయం ఉందని గుర్తించారు. శామ్యూల్‌ మిరాండా సుశాంత్‌ సింగ్‌ ఇంటిలో హౌస్‌ కీపింగ్‌ మేనేజర్‌గా పని చేసేవాడు. ముంబైలోని ఎన్‌సిబి బృందం అరెస్టైన ఇద్దరిని మరింత లోతుగా ప్రశ్నించనుంది.. దర్యాప్తు తర్వాత మరిన్ని ముఖ్యమైన పేర్లు వెలువడతాయని తెలుస్తోంది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) రియా చక్రవర్తి, శామ్యూల్ మిరాండా , ఇతరులను విచారిస్తున్న సమయంలో ఈ అరెస్టులు జరిగాయి. మరోవైపు కుటుంబ సభ్యులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు 'విషం' ఇచ్చి, 'హత్య చేశారు' అని ఆరోపించారు. "రియా చక్రవర్తి చాలా కాలం నుండి తన కొడుకు సుశాంత్ కు విషం ఇచ్చిందని, ఆమెనే తన కుమారుడిని హత్య చేసిందని. దర్యాప్తు సంస్థ ఆమెను ఆమె సహచరులను అరెస్టు చేయాలి అని రాజ్‌పుత్ తండ్రి కెకె సింగ్ గత నెలలో చెప్పారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories