Sushant Singh Rajput Case: సుశాంత్ కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ!

Sushant Singh Rajput Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మరో ఆరుగురిని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది.

Update: 2020-09-14 06:39 GMT

Sushant Singh Rajput

Sushant Singh Rajput Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మరో ఆరుగురిని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. దీనితో అరెస్ట్ అయినవారి సంఖ్య 16కి చేరుకుంది. ముంబయికి చెందిన కరమ్‌జీత్‌సింగ్‌ ఆనంద్‌, డ్వేన్ ఫెర్నాండెజ్, సంకేత్‌ పటేల్, అంకుష్ అన్రేజా, సందీప్ గుప్తా, అఫ్తాబ్ ఫతే అన్సారీని అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు అధికారులు.. ఈ ఆరుగురికి డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రేపు ఎసిఎంఎం కోర్టులో హాజరుపరుస్తారు.

ఇక ఈ కేసులో మొదటి నుంచి A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తిని మూడు రోజుల విచారణ తర్వాత పోలీసులు డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్ చేయగా కొన్ని కీలకమైన విషయాలు బయటకి వచ్చాయి. తనకు డ్రగ్స్ సరఫరా చేసే చాలా మంది పేర్లను షోవిక్ వెల్లడించాడు. రియా చక్రవర్తితో పాటుగా మరో ఐదుగురు బెయిల్ కోసం ముంబై స్పెషల్ కోర్టును ఆశ్రయించగా శుక్రవారం (సెప్టెంబర్ 11) దానిని కోర్టు తిరస్కరించింది. దీనితో వారు సెప్టెంబర్ 22 వరకు ఎన్‌సిబి కస్టడీలో ఉండనున్నారు. అటు రియా తన విచారణలో 25 మంది సెలబ్రిటీల పేర్లు చెప్పడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది.  

Tags:    

Similar News