Supreme Court: బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court: సినీ నటుడు బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Supreme Court: బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court: సినీ నటుడు బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమీ పుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలు పన్ను రాయితీ పొందాయి. అయినా టికెట్ రేటు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలు సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని పిటిషన్‌లో పేర్కొంది. పన్ను రాయితీ పొందిన డబ్బు తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని విన్నవించింది. బాలకృష్ణ, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులందిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నోటీసు వార్తలను గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్ర నిర్మాణ సంస్థలు ధృవీకరించలేదు. ప్రస్తుతం బాలకృష్ణ టర్కీలో సినిమా చిత్రీకరణలో ఉన్నారు.