Superman: సూపర్‌మ్యాన్ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
డీసీ యూనివర్స్‌లోని ‘సూపర్‌మ్యాన్’ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1948 నుంచి ప్రేక్షకులను అలరిస్తూ, బాక్సాఫీస్ వద్ద అద్భుత రికార్డులు సృష్టించిన ఈ ఫ్రాంచైజీ, తాజాగా మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది.
Superman: సూపర్‌మ్యాన్ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
డీసీ యూనివర్స్‌లోని ‘సూపర్‌మ్యాన్’ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1948 నుంచి ప్రేక్షకులను అలరిస్తూ, బాక్సాఫీస్ వద్ద అద్భుత రికార్డులు సృష్టించిన ఈ ఫ్రాంచైజీ, తాజాగా మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ఇటీవల విడుదలైన ‘సూపర్‌మ్యాన్’ (Superman) సినిమా మంచి స్పందన సాధించగా, ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్ గన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ శుక్రవారం సూపర్‌మ్యాన్ మీ ఇంటి తెరపైకి రానున్నాడని తెలిపారు. థియేటర్‌లో ఇంకా ప్రదర్శింపబడుతున్న చోట తప్పక చూసేయమని సూచించారు. అంటే, ఈ సినిమా ఆగస్టు 15న ఓటీటీలో విడుదల కానుందని అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీ (Apple TV)లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
కథ ఏంటంటే: జహ్రాన్‌పూర్‌పై బొరేవియా తన సైన్యంతో దాడి చేసేందుకు సిద్ధమవుతాడు. అయితే సూపర్‌మ్యాన్ (కొరెన్స్‌వెట్) అతని ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ఈ క్రమంలో టెక్నాలజీని ఉపయోగించి ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్ (నికలస్ హోల్ట్) తయారు చేసిన ‘హ్యామర్ ఆఫ్ బొరేవియా’ అనే ఆయుధంతో సూపర్‌మ్యాన్ ఓడిపోతాడు. సూపర్‌మ్యాన్ వల్ల ప్రజలకు ముప్పు తప్పదని, అతడిని అడ్డుకోవాలని లేదా అంతం చేయాలని ప్రభుత్వ పెద్దలకు లెక్స్ లూథర్ ఒత్తిడి తీసుకొస్తాడు. అంతేకాక, సూపర్‌మ్యాన్ పుట్టుక, భూమికి రావడానికి గల కారణాలను బహిర్గతం చేస్తూ ఓ వీడియో విడుదల చేసి, ప్రజలు అతడిపై విరక్తి కలిగేలా చేస్తాడు.
మరి లెక్స్ లూథర్ కుట్రలను సూపర్‌మ్యాన్ ఎలా అడ్డుకున్నాడు? తన విశ్వసనీయతను ఎలా నిరూపించుకున్నాడు? ఈ పోరాటంలో లొయిస్ లేన్ (రెచెల్)తో పాటు ఇతర సూపర్ హీరోలు ఏ విధంగా సహాయం చేశారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.