Superstar Rajinikanth on Coronavirus: రజినీకాంత్ ఇంట్లో కరోనా కలకలం.. పని మనిషికి పాజిటివ్ ?
Superstar Rajinikanth on Coronavirus: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో దూకుడుగా ఉండటంతో ప్రజల జీవన విధానం అతలాకుతలమవుతోంది.
Superstar Rajinikanth on Coronavirus: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో దూకుడుగా ఉండటంతో ప్రజల జీవన విధానం అతలాకుతలమవుతోంది. రోజురోజుకి వైరస్ ఉదృతి ఊహించని స్తాయికి చేరుకోవడం ప్రపంచానికే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయనేతలు, వైద్యులు ఇలా ఏ ఒక్కరినీ కరోనా భూతం వదిలిపెట్టడం లేదు.ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్లో కరోనా వైరస్ కలకలం పుట్టిస్తోంది. దీంతో రజినీకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.రజినీకాంత్ ఇంటిని కూడా కరోనా సెగ తగిలినట్లు వార్తలు రావడంతో... ఆయన అభిమానులు ఆందోళనకు గురైయ్యారు. కానీ, ఆ తర్వాత ఆ వార్తల్లో వాస్తవం లేదని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజా సమాచారం మేరకు కరోనా భయం ఎక్కువ కావడంతో.. రజినీకాంత్ చెన్నై తన సొంత ఇంటిని వదిలేసి, ఇంటికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గ్రాసరీకి సంబంధించి కూడా ఏ పనివారినీ బయటకు పంపించకుండా, కేవలం ఫామ్ హౌస్‌లో పండిన కూరగాయాలనే తింటున్నారట. కరోనా పూర్తిగా వెళ్లిపోయే దాకా తిరిగి చెన్నై రావొద్దని, సినిమా షూటింగ్స్‌లో పాల్గొనని డిసైడ్ అయ్యారనీ తెలుస్తుంది. ఇంట్లో పనిచేసే పని మనిషి ఒకరు కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయ్యాడని తెలిసి.. పని మనుష్యులను కూడా రావొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. రెండు నెలల నుంచే రజనీ కేవలం ఇద్దరు పనిమనుషులకే అనుమతి ఇచ్చారట. ఇక మిగితా వారికి కూడా నెల నెలా జీతం ఇస్తున్నారట. ఇకపోతే రజినీ నివాసం ఉంటున్న ఫామ్ హౌస్ ఎవ్వరైనా.. బయటకు వెళ్లడం, బయటివాళ్ళు లోపలికి రావడం పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.