OTT: సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'కార్తిక-మిస్సింగ్ కేస్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌

Karthika Missing Case OTT: ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న తమిళ మర్డర్ మిస్టరీ యుగి నేటి నుంచి Aha OTTలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

Update: 2025-06-13 03:38 GMT

OTT: సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'కార్తిక-మిస్సింగ్ కేస్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌

Karthika Missing Case OTT: ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న తమిళ మర్డర్ మిస్టరీ యుగి నేటి నుంచి Aha OTTలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తెలుగు వెర్షన్ కి 'కార్తిక-మిస్సింగ్ కేస్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని భవాని మీడియా రిలీజ్ చేస్తుంది.

జాక్ హారిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, గొప్ప స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను పూర్తిగా అలరించింది. కథిర్, నట్టి, ఆనందీ, నరైన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా, తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది.

కథలో, ఒక డిటెక్టివ్ తన బృందంతో కలిసి అదృశ్యమైన యువతిని వెతుకుతున్నాడు. దర్యాప్తులో కార్తిక అనే అమ్మాయి గురించి బయటపడే షాకింగ్ నిజాలు, అనూహ్య మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతాయి.

అద్భుతమైన నటన, తీవ్రమైన థ్రిల్, భావోద్వేగాల మేళవింపు ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్‌గా నిలబెట్టాయి.

ఈ వారం విడుదలయ్యే అత్యంత ఆసక్తికరమైన థ్రిల్లర్‌ను మిస్‌ అవకండి —కార్తిక-మిస్సింగ్ కేస్, రేపటి నుంచి కేవలం Aha OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మీ వీకెండ్‌ను మిస్టరీ, థ్రిల్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేయండి.

Tags:    

Similar News