Raj Kundra: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బిగుస్తున్న ఉచ్చు

Raj Kundra: రాజ్ కుంద్రా కేసులో నటి షెర్లీన్ చోప్రాకు సమన్లు జారీ * సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ముంబయి పోలీసులు

Update: 2021-07-27 05:24 GMT
రాజ్ కుంద్రా కేసులో నటి షెర్లిన్ చోప్రా కు సమన్లు జారీ (ఫైల్ ఇమేజ్)

Raj Kundra: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఉచ్చు బిగుస్తోంది. అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్‌ కుంద్రాకు పోర్న్‌ వీడియోల రాకెట్ఖుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్‌ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. ఈరోజు 11 గంటలకు తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవాళ షెర్లీన్ చోప్రాను ప్రశ్నించిన తర్వాత మరికొందరిని కూడా విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్‌ ఉద్యోగుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. నలుగురు ఉద్యోగులు ఈ కేసులో సాక్షులుగా మారారు. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని భావిస్తున్న రాజ్ కుంద్రాకు ఈ పరిణామం తీవ్ర విఘాతం కలిగిస్తోంది.

రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత షెర్లిన్ చోప్రా మొదటిసారి మౌనం వీడింది. ఈమేరకు ఒకవీడియోను కూడా షేర్‌ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్‌కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ..పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై ఎటాక్‌ చేసింది. అయితే షెర్లిన్‌ చోప్రా తర్వాత ముంబై పోలీసులు ఇంకెవరిని పిలుస్తారో అని రాజ్‌కుంద్రా సన్నిహితులు టెన్షన్‌ పుడుతున్నారు. 

Tags:    

Similar News