సుడిగాలి సుధీర్ లక్కీ ఛాన్స్.. ఏకంగా ప్రభాస్ డైరెక్టర్ తో సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్...పేరుకి తగ్గట్టే సుడిగాడు అనిపించుకుంటున్నాడు.

Update: 2023-04-20 12:00 GMT

సుడిగాలి సుధీర్ లక్కీ ఛాన్స్.. ఏకంగా ప్రభాస్ డైరెక్టర్ తో సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్...పేరుకి తగ్గట్టే సుడిగాడు అనిపించుకుంటున్నాడు. మెజీషియన్ గా కెరీర్ ప్రారంభించి అనంతరం జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. బుల్లితెర పై కామెడీ, వెండితెరపై యాక్షన్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ ని సంపాదించుకున్న సుధీర్ సినీ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుకుంటున్నాడు.

సుధీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్లు చేసినా ప్రస్తుతం హీరోగా మారి హిట్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే గాలోడు టైటిల్ తో బాక్సాఫీస్ ముందుకొచ్చి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. గాలోడు హిట్టవ్వడంతో సుధీర్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వెండితెర గాలోడు...కాలింగ్ సహస్ర అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుడిగాలి సుధీర్ కి బంపర్ లాటరీ తగిలింది.

ఇప్పటివరకు సుధీర్ చిన్నస్థాయి దర్శకులతో వర్క్ చేశాడు. ఇకపై పెద్ద దర్శకుడితో పని చేసే లక్కీ ఛాన్స్ పట్టేశాడు. ఆ పెద్ద దర్శకుడు మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్ తో మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ తీసిన డైరెక్టర్ దశరథ్ కాంబినేషన్ లో సుధీర్ హీరోగా నటించబోతున్నాడు. సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ వంటి బ్లాక్ బస్టర్స్ ను అందించిన దశరథ్ ఆ తర్వాత తన స్థాయికి తగ్గ హిట్టివ్వలేదు. చివరిగా ఆయన మంచు మనోజ్ హీరోగా శౌర్య సినిమా తీశాడు ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. కట్ చేస్తే మళ్లీ ఇన్నాళ్లకు సుడిగాలి సుధీర్ సినిమాతో దశరథ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు.

సుధీర్-దశరథ్ సినిమాకి నిర్మాతలు కూడా ఫిక్స్ అయ్యారట. అంతేకాదు, సుధీర్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పూజిత పొన్నాడతో మన వెండితెర గాలోడు రొమాన్స్ చేయబోతున్నాడట..మొత్తానికి, ఈ సినిమా హిట్టైతే సుధీర్ సుడి తిరగడం ఖాయం.

Tags:    

Similar News