Suchendra Prasad: కాపురాలు కూల్చడం అలవాటే.. అందుకే వదిలేసింది..
Suchendra Prasad: సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.
Suchendra Prasad: కాపురాలు కూల్చడం అలవాటే.. అందుకే వదిలేసింది..
Suchendra Prasad: సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ట్విస్టులను మించి నడుస్తోంది వీరి విషయం. వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ తాము పెళ్లి చేసుకోలేదని సహజీవనమే చేస్తామంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం మీద పవిత్ర లోకేష్ భర్తగా చెబుతున్న సుచేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
నటి పవిత్రపై సీరియస్ కామెంట్లు చేశారు. పవిత్రకు కాపురాలు కూల్చడం అలవాటే అంటూ బాంబు పేల్చారు. ఆమెకు డబ్బు పిచ్చి బాగా ఉందని, అందుకే తనను వదిలేసి వెళ్లిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇంకోవైపు పవిత్ర కూడా సుచేంద్ర ప్రసాద్ కామెంట్లపై స్పందించింది. అసలు సుచేంద్రను తాను పెళ్లి చేసుకోలేదని మరో ట్విస్టు ఇచ్చింది. ప్రస్తుతం నరేశ్ తోనే కలిసి ఉంటున్నానని, తామిద్దరం గెస్ట్ హౌస్ లో కలిసి జీవిస్తున్నట్టు తెలిపింది. నరేశ్ కుటుంబ సభ్యులు తనను ఫ్యామిలీ మెంబర్ గా గుర్తించారంటూ చెప్పుకొచ్చింది.