SSMB 29: ఆర్‌ఆర్‌ఆర్‌ను మించే ఇంటర్వెల్ సీన్.. జక్కన్న భారీ ప్లాన్!
ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB 29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మహేశ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ-లుక్ పోస్టర్ అభిమానుల్లో సంచలనం సృష్టించింది.
SSMB 29: ఆర్‌ఆర్‌ఆర్‌ను మించే ఇంటర్వెల్ సీన్.. జక్కన్న భారీ ప్లాన్!
ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB 29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మహేశ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ-లుక్ పోస్టర్ అభిమానుల్లో సంచలనం సృష్టించింది. షూటింగ్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, సినిమా యూనిట్ ఓడిశా అడవుల్లో షెడ్యూల్ పూర్తి చేసి, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో భారీ షెడ్యూల్‌ని జరుపుతోంది.
అక్కడి దట్టమైన అడవుల్లో, క్రూరమైన జంతువుల మధ్య తెరకెక్కుతున్న యాక్షన్ సన్నివేశం ఇప్పటివరకు తెలుగు తెరపై ఎప్పుడూ చూడని రీతిలో ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ విషయంలో రాజమౌళి పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. త్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ బ్లాక్‌కి మించి ఉండే విధంగా ఈ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారని టాక్.
ఇందులో మహేశ్ బాబు లుక్ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. భారీ సింహాలతో కూడిన ఛేజ్ సీక్వెన్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసి, నెలల తరబడి షూట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశాడు. రాజమౌళి సినిమాల ప్రత్యేకతేంటంటే – ప్రతి ఫ్రేమ్ తనకు నచ్చే వరకు ఎన్ని సార్లు అయినా రీ-షూట్ చేయడం. అందుకే ఆయన సినిమాలపై ఆ రేంజ్ హైప్ ఉంటుంది.
ఇక ఈసారి సింహాలతో కూడిన సన్నివేశాలు, అంతేకాకుండా ఘనమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉండటంతో రాజమౌళి మరింత సమయం కేటాయిస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. ఇటీవల మహేశ్ సౌత్ ఆఫ్రికాలోని ఒక ఫేమస్ సింహాన్ని కూడా వీక్షించాడట. దానిని సినిమాలో చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.