SP Balasubrahmanyam Health: ఆ వార్తలను నమ్మకండి.. ఎస్పీ చరణ్..
SP Balasubrahmanyam Health: వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆర్యోగంపై సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతున్నాయి
balasubramaniam
SP Balasubrahmanyam Health | వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆర్యోగంపై సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతున్నాయి. వాటన్నింటికి పుల్ స్టాప్ పెట్టడానికి ఎస్పీ చరణ్ తన ఇస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియాను పోస్ట్ చేశారు. ఎస్పీ బాలు మెల్ల మెల్గగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నా.. ఇప్పటికీ ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ లేవని చెప్పుకోచ్చారు. ఈ క్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వివిధ మాధ్యమాలు వారికి తోచినట్టు వార్త కథనాలు రాస్తున్నారు. ఇక తన తండ్రి హెల్త్ విషయమై ఏ విషయమైన.. మా ద్వారా మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.
గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఎలాంటి మార్పులు లేవు. అందుకే హెల్త్ విషయమై అప్‌డేట్స్ ఇవ్వలేదు. ఐతే.. కొన్ని మీడియా సంస్థలు వార్తలను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో తెలియదు కానీ.. వారి ఇష్టానూసారంగా రాస్తున్నారని అన్నారు. నాన్న గారికి సంబంధి ఏదైనా విషయం ఉంటే.. మీడియాకు తెలియజేస్తున్నానన్నారు. ఏ విషయమైన నేను కానీ హాస్పిటల్ వర్గాలు కానీ అధికారలు ప్రకటన చేసిన విషయాలనే ప్రచురించాలని కోరారు. అభిమానుల ఆశీస్సులతో నాన్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని అందరం ఆశిద్దామని ఎస్పీ చరణ్ అన్నారు.