SP Balasubrahmanyam health bulletin: నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం
SP Balasubrahmanyam health bulletin: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ డాక్టర్ల పర్యవేక్షణలో ఎస్పీ బాలుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు
SP Balasubrahmanyam’s health stable now
SP Balasubrahmanyam health bulletin: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ డాక్టర్ల పర్యవేక్షణలో ఎస్పీ బాలుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ ద్వారా ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు యంజీయం యాజమాన్యం హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నది. ఈ వైద్య టీమ్‌లో ఇంటర్నల్ మెడిసన్, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఇన్ఫెక్టివ్ డీసీజెస్, ఎక్మోకేర్‌లో విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉన్నారని తెలిపారు.
యూకే, యూఎస్‌లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సాయంతో అక్కడి వైద్యులు చికిత్స చేశారని తెలిపింది. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడటానికి ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తీసుకుంటున్న చర్యలపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు అని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.