రేపు ఎస్పీ బాలు అంత్యక్రియలు

Update: 2020-09-25 11:55 GMT

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలను రేపు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. బాలు పార్థివదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి నుంచి చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ఉదయం వరకు ఇంటి వద్దనే బాలు భౌతికకాయం ఉండనుంది. ఆ తర్వాత అభిమానులు సందర్శన కోసం శనివారం ఉదయం సత్యం థియేటర్‌కు తీసుకెళ్లనున్నారు.

అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీగా పోలీస్‌ బందోబస్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం నివాసంలోనే ఏర్పాట్లు చేశారు. బాలు నివాసం వద్దకు ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన గాయకుడి భౌతికకాయం వద్ద అశ్రునివాళి అర్పిస్తున్నారు. శనివారం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో తమరాయిపక్కంలోని ఆయన ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చేసిన అంతిమయాత్ర రథం సిద్ధంగా ఉంచారు.


Tags:    

Similar News